ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద సినిమా వేడుకలలో భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పవచ్చు. చిత్ర పరిశ్రమలో అందరు మాట్లాడుకునే విధంగా ఈ వేడుక జరిగింది. ఎందుకంటే తారక్ – మహేష్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఎంతో ఆనందానికి గురి చేసింది. అంతే కాకుండా ఇద్దరు స్టార్ హీరోలు వారి రిలేషన్ గురించి చెప్పుకోవడం అలాగే అభిమానులు వారిని చూసి ఆనందపడటం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది.
ఇక భరత్ బహిరంగ సభలో ఎన్టీఆర్ చేత భరత్ అనే నేను ట్రైలర్ ను లాంచ్ చేయించారు. దీంతో మహేష్ అభిమానులు అభిమాన హీరోను సరికొత్త పాత్రలో చూసేసరికి థ్రిల్ అయ్యారు. అభిమానులు అత్యధిక సంఖ్యలో హాజరై సినిమాపై అంచనాలను మరింత పెంచారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు సూపర్ స్టార్ కృష్ణ, నరేష్ కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 20న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.


