టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. విభిన్నంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై యువ హీరో శ్రీనివాస్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. సాక్ష్యం సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. గత కొన్ని వారాలుగా సాగుతోన్న ఒక షెడ్యూల్ ను ముగించుకొని నెక్స్ట్ షెడ్యూల్ ని యూఎస్ కి షిఫ్ట్ చేయాలనీ చూస్తున్నారు.
అక్కడ కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని చిత్రీకరించనున్నారు. హీరో బెల్లకొండ శ్రీనివాస్ తో పాటు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా అక్కడికి వెళ్లనున్నారు. ఇక ఈ షెడ్యూల్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పూజ హేగ్దే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. ఇక త్వరలో రెగ్యులర్ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసి సినిమాను మే 11న రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు.


