ఇద్దరు పెద్ద హీరోల నడుమ నాని !

ఇద్దరు పెద్ద హీరోల నడుమ నాని !

Published on Apr 11, 2018 11:31 AM IST

సక్సెస్ ఫుల్ హీరో నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ రేపు 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో పాటు రేపు చెప్పుకోదగిన వేరే సినిమాలేవీ విడుదలకావడంలేదు కానీ ఇద్దరు పెద్ద హీరోల నుండి మాత్రం నాని గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ పెద్ద హీరోలే రామ్ చరణ్, మహేష్ బాబులు.

రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’ గత నెల 30న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇప్పటికీ చాలా చోట్ల ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తుండటం వలన నాని సినిమా తొలిరోజు నుండే హిట్ తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోగలిగితేనే ‘రంగస్థలం’ ప్రభావాన్ని దాటుకుని ఇంకో 10 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 20న భారీ ఎత్తున రానున్న మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే నేను’ తాకిడిని కూడ తట్టుకుని సినిమా లాంగ్ రన్లో నిలబడగలుగుతుంది.

ఇక ప్రేక్షకుల విషయానికొస్తే ఎప్పటికప్పుడు కథల పరంగా కొత్తదనాన్ని చూపించే నాని ఈసారి కూడ తప్పకుండా అలరిస్తారనే నమ్మకంతోనే ఉన్నారంతా.

తాజా వార్తలు