సాయి ధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తేజ్ ఐ లవ్ యు’. కరుణాకరన్ తన స్టైల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లకు విశేష స్పందన కూడ దక్కింది. ఈరోజు చిత్ర టీమ్ కొత్త పోస్టర్ ఒకదాన్ని రిలీజ్ చేసింది. అందులో తేజ్ మైక్, గిటార్ పట్టుకుని రాక్ స్టార్ ను తలపిస్తుండటంతో చిత్రం కరుణాకరన్ గత చిత్రమైన ‘డార్లింగ్’ ను పోలి ఉంటుందనే కామెంట్స్ వినబడ్డాయి.
కొందరైతే చిత్రంలో తేజ్ ‘డార్లింగ్’ సినిమాలో ప్రభాస్ మాదిరిగానే రాక్ స్టార్ గా కనిపిస్తారని కూడ అన్నారు. వీటిపై స్పందించిన తేజ్ పోస్టర్లో కేవలం గిటార్, మైక్ పట్టుకున్నంత మాత్రాన సినిమా ‘డార్లింగ్’లా ఉంటుందని కాదు. ఇది ‘తేజ్ ఐ లవ్ యు’ అంటూ చిత్రం కొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 29న విడుదలచేయనున్నారు.


