ఓవర్సీస్ మార్కెట్ పై కన్నేసిన సుధీర్ బాబు !

ఓవర్సీస్ మార్కెట్ పై కన్నేసిన సుధీర్ బాబు !

Published on May 30, 2018 4:31 PM IST

ఈరోజుల్లో కలెక్షన్లంటే కేవలం లోకల్ మాత్రమే కాదు ఓవర్సీస్ కూడ. అందుకే యువ హీరోలు అక్కడి మార్కెట్ పై కూడ దృష్టి పెడుతున్నారు. సినిమా రిలీజవుతోంది అంటే స్వయంగా అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే పని చేశారు సుధీర్ బాబు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సమ్మోహనం’.

ఈ సినిమాకు సంబందించి యూఎస్లో ప్రమోషనల్ టూర్ ను నిర్వహించారు సుధీర్ బాబు. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలకు యూఎస్లో ఆదరణ బాగా లభిస్తున్న ఈ తరుణంలో సుధీర్ బాబు అండ్ టీమ్ చేసిన ఈ ప్రయత్నం చిత్రానికి లాభిస్తుందనే చెప్పాలి. అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడ సినిమాను మంచి స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పైగా కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ చిత్ర టీజర్ బాగుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ చిత్ర ట్రైలర్ రేపు సూపర్ స్టార్ కృష్ణగారి చేతుల మీదుగా విడుదలకానుంది. చిత్రాన్ని జూన్ 15న ప్రేక్షకులకు అందివ్వనున్నారు నిర్మాతలు.

తాజా వార్తలు