పందెంకోడి 2 సినిమా విశేషాలు !

పందెంకోడి 2 సినిమా విశేషాలు !

Published on May 30, 2018 10:33 PM IST


2005 లో విశాల్ , మీరా జాస్మిన్ హీరో హీరోయిన్లుగా తమిళ భాషలో లింగు సామి తెరకేకించిన ‘సందకోడి’ చిత్రం సూపర్ హిట్ సాధించి విశాల్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఈ సినిమా’పందెంకోడి’ పేరుతో తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది .

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా లింగుసామి దర్శకత్వంలో ‘సందకోడి 2’ చిత్రం తెరకెక్కుతుందని తెలిసిందే . ఈ సినిమాలో హీరో విశాల్ సరసన కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ లు నటిస్తున్నారు . ఈ చిత్రం 60 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని ఫైనల్ షెడ్యూల్ కోసం దిండిగల్ , కార్తెకుడి ప్రదేశాలకు వెళ్లనుంది .

విశాల్ సొంత సంస్థ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు . తెలుగులో ‘పందెంకోడి 2’ గా రానున్న ఈసినిమా ఫై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు