మలయాళంలో ప్రేమమ్ సినిమాతో అనుపమా పరమేశ్వరన్ మంచి క్రేజ్ తో పాటు కొన్ని మంచి అవకాశాలు కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనుపమ స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేకపోయింది. కాగా ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఓ షాకింగ్ విషయమే బయటపెట్టింది.
రంగస్థలం చిత్రంలో ముందుగా సమంత స్థానంలో అనుపమా పరమేశ్వరన్ని అనుకున్నారు. అనుపమా మీద స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం మిస్ అయిందని స్వయంగా అనుపమానే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను రంగస్థలం చూశానని రామలక్ష్మి పాత్రను సమంత అద్భుతంగా చేశారని అదేవిధంగా మహానటిలో సావిత్రిగారి పాత్రలో కీర్తి సురేష్, సమ్మోహనం చిత్రంలో అదితిరావ్ హైదరీ కూడా అద్భుతంగా నటించారని అనుపమ చెప్పారు.


