సూపర్ హిట్ తమిళ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ పూర్తైంది !

సూపర్ హిట్ తమిళ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ పూర్తైంది !

Published on Jul 2, 2018 6:14 PM IST

Druva vikram

తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న ‘చతురంగ వెట్టై’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రంలో కథానాయకుడిగా ‘జ్యోతి లక్ష్మి’ ఫేమ్ సత్య దేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను గోపీ గణేష్ పట్టాభి డైరెక్ట్ చేస్తున్నారు.

ఇందులో ‘ఎక్క‌డికి పోతావు చిన్నవాడా` ఫేమ్ నందిత శ్వేత కథానాయకిగా నటిస్తోంది. ఆగష్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచి సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ ఫిల్మ్స్ అధినేత రమేష్ పిళ్ళై నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో పృథ్వి, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ వంటి ప్రముఖులు నటిస్తున్నారు.

తాజా వార్తలు