సినిమా కోసం నా రక్తం, చెమట, కన్నీళ్లను ధారపోశాను – సంపూర్ణేష్ బాబు

సినిమా కోసం నా రక్తం, చెమట, కన్నీళ్లను ధారపోశాను – సంపూర్ణేష్ బాబు

Published on Jul 2, 2018 7:42 PM IST

Sampoornesh
‘హృదయ కాలేయం’ అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంపూర్ణేష్ బాబు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత కొబ్బరిమట్ట అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చాలా రోజుల క్రితం మొదలు పెట్టిన ఈ చిత్రం సాగుతూ సాగుతూ ఇటీవలే పూర్తయింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యటానికి మేం రెడీ అంటూ నిర్మాతలు సరదాగా కొబ్బరిమట్ట చిత్రం పోస్టర్ మీద ‘కొబ్బరిమట్ట చిత్రం తొలివారం ఎక్స్‌పెక్టెడ్ గ్రాస్‌గా 233.64కోట్లు’ అని ఫన్నీగా రాసి పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం గురించి సంపూర్ణేష్ బాబు ఓ ట్వీట్ చేశారు. ‘ఎట్టకేలకు సిద్దమయ్యాం. సంవత్సరంన్నర పడ్డ కష్టం.. కష్టం అనేది చిన్నమాటే అవుతుంది.. ఈ సినిమా కోసం నా రక్తం, చెమట, కన్నీళ్లను ధారపోశాను. రిలీజ్ డేట్ కోసం రెడీగా ఉండండి’’ అంటూ సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు.

తాజా వార్తలు