బాలయ్య నమ్మితే అంతే మరి !

బాలయ్య నమ్మితే అంతే మరి !

Published on Jul 2, 2018 2:44 PM IST

Balakrishna

క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలయ్యే స్వయంగా ఎన్టీఆర్ స్క్రిప్ట్ ను తన ఆలోచనలకు దగ్గరిగా రాయించుకున్నారు. అయినా క్రిష్ స్క్రిప్ట్ లో తనదైన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. క్రిష్ చేసిన మార్పులు బాలయ్యకు బాగా నచ్చాయని ఇక అప్పటినుంచి పూర్తి బాధ్యతలు క్రిష్ మీదే పెట్టేశారట. ఆర్టిస్టులు, స్క్రిప్ట్, టెక్నీషియన్లు ఇలా ప్రతిదీ క్రిష్ నిర్ణయిస్తున్నారు.

బాలయ్య ఒకసారి దర్శకుడ్ని నమ్మితే అంతే.. ఆ దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కూడా అదే జరుగుతోంది. జులై 5న లో ఈ చిత్రం చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు