
గత ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ , హిందీ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ భాషలో ‘వర్మ’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరో గా నటిస్తున్నాడు .
ఇక ఈ చిత్రంలో ఆయనకు జోడిగా శ్రీయా శర్మను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తెలుగు నటి ఈశ్వరి రావు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు .

