
యాక్షన్ హీరో గోపిచంద్ తాజగా నటించిన ‘పంతం’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస పరాజయాలతో సతమతమవున్న గోపిచంద్ కెరీర్ కి పంతం చిత్రం చాలా కీలకం కానుంది. మరి పంతం చిత్రం ఎలా ఉండబోతుంది. గోపీచంద్ ఆశిస్తున్నట్లు భారీ విజయాన్ని అందిస్తుందా ? సినీవర్గాల సమాచారం ప్రకారం మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించారని తెలుస్తోంది.
కాగా ఈ చిత్రంలో కొన్ని సామజిక అంశాలను ప్రస్తావించారని అలాగే మన రాజకీయ వ్యవస్థలోను కుళ్ళును కూడా ఈ చిత్రంలో ప్రధానంగా చూపించారని సమాచారం. ఇప్పటికే ట్రైలర్ గోపిచంద్ అభిమానులను అలరిస్తోంది. ఇక గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

