మహేష్ పాత్రపై మరో ఆసక్తికరమైన వార్త !

మహేష్ పాత్రపై మరో ఆసక్తికరమైన వార్త !

Published on Jul 3, 2018 8:33 AM IST

Mahesh1

వచ్చే ఏడాది వేసవికి విడుదలకానున్న భారీ సినిమాల్లో మహేష్ బాబు యొక్క 25వ సినిమా కూడ ఒకటి. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు ఎంబిఎ విద్యార్థిగా, హీరోయిన్ పూజా హెగ్డే, నటుడు నరేష్ ఆయన క్లాస్ మేట్స్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మహేష్ పాత్ర గురించి ఇంకో ఆసక్తికరమైన వార్త కూడ వినిపిస్తోంది. అదేమిటంటే సినిమాలో మహేష్ ఒక అమెరికన్ కంపెనీకి సీఈవోగా కూడ కనిపిస్తారట. ప్రస్తుతం జరుగుతున్న డెహ్రాడూన్ షూట్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని కూడ అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు