గత ఏడాది ‘గురు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్. ఇక ఈ సినిమా తరువాత కొంత సమయం తీసుకొని వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారాయన. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇక ఈ చిత్రంతో పాటు నాగ చైతన్యతో కలిసి మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు వెంకీ. ఈ చిత్రం కూడా త్వరలోనే లాంచ్ కానుంది. ఇవి కాకుండా రానాతో కూడా ఒక మల్టీ స్టారర్ చిత్రం చేస్తాడని నిర్మాత సురేష్ బాబు ఇటీవల వెల్లడించారు.
ఇక ఈ చిత్రాల తరువాత కూడా వెంకీ సోలో హీరోగా సినిమాలు తగ్గించేసి మల్టీ స్టారర్ చిత్రాలవైపే మొగ్గు చూపనున్నాడు. ఎటువంటి బేషజాలు లేకుండా కథ నచ్చితే ఎవరితోనైనా సినిమా చేయడానికి వెనుకాడడని పేరున్న వెంకీ నుండి రానున్న రోజుల్లో మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలు రావడం ఖాయం.


