సూపర్ స్టార్ భార్య పై సుప్రీంకోర్టు ఆగ్రహం !

సూపర్ స్టార్ భార్య పై సుప్రీంకోర్టు ఆగ్రహం !

Published on Jul 3, 2018 7:27 PM IST

Latha Rajinikanth

రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొచ్చాడియాన్‌’ చిత్ర నిర్మాణం కోసం లతా రజనీకాంత్‌ బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ నుంచి రూ.6.20 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. 2014లో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయంగా నిలిచింది.

కాగా లతా రజనీకాంత్‌ యాడ్‌బ్యూరో సంస్థకు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోగా కోర్టు విచారణకు కూడా హాజరుకావవడం లేదు. దాంతో రుణం చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆ సంస్థ ఫిర్యాదు చేసింది. దాంతో జూలై 3 లోపు రుణాన్ని చెల్లించాల్సిందేనని లతా రజనీకాంత్‌ కు గత ఫిబ్రవరిలో కోర్టు ఉ‍త్తర్వులు జారీ చేసింది. కానీ ఇంతవరకు రుణం చెల్లించకపోవడంతో లతా రజనీకాంత్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించింది.

తాజా వార్తలు