‘సత్యమేవ జయతే’ సినిమా పై బీజేపీ నాయకుడు ఫిర్యాదు !

‘సత్యమేవ జయతే’ సినిమా పై బీజేపీ నాయకుడు ఫిర్యాదు !

Published on Jul 3, 2018 8:29 PM IST

Satyamev Jayate7

బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం కథానాయుకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సత్యమేవ జయతే’. ఐతే ఇప్పుడు ఈ చిత్రం వివాదం చుట్టూ తిరుగుతుంది. బీజేపీ నాయకుడు సయ్యద్ అలీ జఫ్రీ ముస్లింలలోని షియా వర్గాన్ని అవమానించేలా ‘సత్యమేవ జయతే’ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ ఆయన ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ లో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని సయ్యద్ అలీ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు కూడా చేశారు.

‘సత్యమేవ జయతే’ చిత్రబృందం పై చర్యలు తీసుకోవాలని సెన్సార్ బోర్డుకి కూడా ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. షియా వర్గానికి సంబంధించిన దృశ్యాలన్నీ తొలగించకపోతే హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చిరించారు. మరి ఆయన ఆరోపణల పై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

తాజా వార్తలు