నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో.. ఎన్టీఆర్ పాత్రను బాలయ్య, ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకంగారి పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, నవంబర్ లోకల్లా పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఐతే ఈ నెల 18 నుంచి 24 వరకు జరిగే షెడ్యూల్ లో బాలకృష్ణ, విద్య బాలన్ మధ్య సాగే భావోద్వేగమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.
ముఖ్యంగా బసవతారకంగారి చివరి రోజుల్లోని సంఘటనలను తెరకెక్కించనున్నారు. అలాగే బసవతారకమ్మగారిని ఎన్టీఆర్ గారు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ చిత్రంలో అదే విషయానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సన్నివేశం కూడా ఉందని సమాచారం. బసవతారకంగారి పాత్రకు విద్యాబాలన్ తన నటనతో నిండుదనం తెస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


