మరోసారి తన నటనతో పడేసేలా ఉంది !

మరోసారి తన నటనతో పడేసేలా ఉంది !

Published on Jul 15, 2018 12:28 PM IST

PadipadiLecheManasu

ఫిదా చిత్రంలోని తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సాయి పల్లవి తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి హనురాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ కి జోడిగా ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో సాయి పల్లవి తన నటనతో మరిసారి తెలుగు ప్రేక్షకులను సమ్మోహనపరచనుంది.

సాయి పల్లవి ఈ చిత్రంలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తోంది. ఐతే ఆమె క్యారెక్టర్ చాలా కొత్తగా ఇంతకుముందెప్పుడూ తెలుగు సినిమాల్లో రాని విధంగా తన క్యారెక్టర్ ఉంటుందట. ప్రత్యేకించి సాయి పల్లవి పాత్రను చూశాకా, అందరూ కొత్తగా ఫీల్ అవుతారని, ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన సినిమాకే హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. కాగా క్లైమాక్స్‌ లో వచ్చే భూకంపం సన్నివేశాలకి సంబంధించి విజువ‌ల్ గ్రాఫిక్స్‌, ఎఫెక్ట్స్‌ సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్తాయని చిత్రబృందం చెబుతుంది. ఏమైనా ‘పడి పడి లేచె మనసు’ చిత్రంతో సాయి పల్లవి మరోసారి తన నటనతో తెలుగు ప్రేక్షకులను పడేసేలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు