బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా, శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలై
మిశ్రమ స్పందనలను అందుకుంది. కానీ ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం సినిమాలో భారీ ఫైట్స్ అండ్ విజువల్స్ హీరో శ్రీనివాస్ లుక్స్, పూజా గ్లామర్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రలో మేజర్ సింగిల్ స్క్రీన్స్ లో, బి.సి సెంటర్స్ లో మార్నింగ్ షో, మ్యాట్నీ షోలకు రెస్పాన్స్ చాలా బాగుంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, వండర్ ఫుల్ విజువల్స్ ఆడియన్స్ ను ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు ప్రధాన విలన్ పాత్రను పోషించారు.


