అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నూతన దర్శకుడు సంపత్ .వి.రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం ‘ఇష్టంగా’. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా యొక్క చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో ‘పెళ్లిచూపులు’ ఫెమ్ ప్రియదర్శి ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు.
ఇక ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ .వి మాట్లాడుతూ.. ఇష్టంగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్. నేటి జనరేషన్ లో ప్రేమకున్న, ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఎంటన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఔట్ ఎండ్ ఔట్ యూత్ ఫుల్ మూవీ గా రూపొందుతొంది. యేలేంద్ర మహావీర్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలొనే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


