అనుపమా కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్న రామ్ !

అనుపమా కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్న రామ్ !

Published on Sep 9, 2018 1:52 PM IST

Hello Guru Prema Kosame

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ‘సినిమా చూపిస్తా మావ’ ‘నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన టీమే, ఈ చిత్రానికి కూడా కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ ట్రాక్ చాలా బాగా వస్తుందని తెలుస్తోంది.

అయితే, తాజా సమాచారం ప్రకారం సినిమాలోని కొన్ని కీలకమైన కాలేజీ సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్‌ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ పాత్ర పోషిస్తున్నారు. దాంతో అనుపమా కోసం రామ్ కాలేజీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ తిరుగుతారట. జరుగుతున్న షెడ్యూల్ లో ఈ కాలేజీ సన్నివేశాలనే చిత్రబృందం చిత్రీకరిస్తుంది. పైగా ఈ చిత్రంలో రామ్ – అనుపమా బావ మరదళ్లగా కనిపించనున్నారు. అనుపమా తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కి రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయని చిత్రబృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు