సమంత ‘యూటర్న్’ అంత రాబట్టగలదా !
Published on Sep 12, 2018 11:30 am IST

అగ్ర హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూ టర్న్’. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం వినాయకచవితి రోజు రేపు తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈచిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు రూ.16కోట్ల కు అమ్ముడయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 8కోట్ల కు ఈహక్కులను అమ్మారని సమాచారం. ఈ లెక్కన ఈమొత్తాన్ని రాబడితే గాని ఈ చిత్రం సేఫ్ ప్రాజెక్ట్ అవ్వదు.

అయితే సమంత నటించిన గత చిత్రాలు ‘రంగస్థలం, మహనటి, అభిమన్యుడు’ ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. మరి సమంత ఈసారి కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తే ఈ 16కోట్లను రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. పైగా తెలుగు, తమిళ భాషల్లో ఆమె కు మంచి ఇమేజ్ కూడా వుంది.

మరి చూడాలి యూ టర్న్ బాక్సాఫిస్ వద్ద ఏ రేంజ్ లో వసూళ్లను సాధిస్తుందో. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. కన్నడలో విజయం సాధించిన ‘యూటర్న్’ చిత్రానికి రీమేక్ గా వస్తుంది ఈ చిత్రం. .

  • 11
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook