అఖిల్ 3 లో ఆ స్టార్ హీరోయిన్ ?

అఖిల్ 3 లో ఆ స్టార్ హీరోయిన్ ?

Published on Sep 13, 2018 5:20 PM IST

kajal3

‘అఖిల్, హలో’ చిత్రాల తరువాత అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం తన మూడవ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలి ప్రేమ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుంది.

ఇక అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా మరో స్టార్ హీరోయిన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఆమె ఎవరో కాదు కాజల్ . ఈ చిత్రంలో ఆమె సపోర్టింట్ పాత్రలో నటిస్తునట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈవార్తలు ఇంకా ద్రువీకరించబడలేదు.

‘మిస్టర్ మజ్ను’ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు