‘మదర్‌ థెరిసా’ అవార్డు అందుకున్న దర్శక నటుడు !

‘మదర్‌ థెరిసా’ అవార్డు అందుకున్న దర్శక నటుడు !

Published on Sep 15, 2018 4:06 PM IST

Raghava Lawrence

సినీపరిశ్రమలో బహుముఖప్రజ్ఞాశాలిలు చాలామంది ఉంటారు. కానీ వారిలో అలాగే సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నవారు మాత్రం చాలా అరుదుగానే కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు దర్శక నటుడు కొరియోగ్రాఫర్ లారెన్స్‌ అనే చెప్పాలి. అందుకే ఆయనకు ‘మదర్‌ థెరిసా’ అవార్డ్ లభించింది.

వివరాల్లోకి వెళ్తే ఎంటీసీటీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో లారెన్స్‌కు ‘మదర్‌ థెరిసా’ అవార్డును అందజేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌, పీఎంకే నాయకుడు రామదాసు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై లారెన్స్‌కు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లారెన్స్‌ మాట్లాడుతూ ఎంత సంపాదించినా చనిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్లమని అందుకే ఇక నుంచి మధర్‌ థెరిసా బాటలో పయనించాలని నిర్ణయించుకున్నానని’ తెలిపారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు