నోటా అనుకున్న సమయానికి రావట్లేదు ?

నోటా అనుకున్న సమయానికి రావట్లేదు ?

Published on Sep 17, 2018 1:32 PM IST

nota 16

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’ అనుకున్న సమయానికి విడుదల కావట్లేదు అని సమాచారం. ఈచిత్రం అక్టోబర్4న విడుదలకావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో జాప్యం కారణంగా ఆలస్యంగా విడుదలకానుంది. అన్ని కుదిరితే ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్18న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

ఒకవేళ ఈవార్తలు నిజమైతే ఈచిత్రం రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో బాక్సాఫిస్ వద్ద పోటీ పడనుంది. ‘ఇరుముగన్ ‘ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్నఈచిత్రంలో మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంఫై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు