భారీ ధర పలికిన ‘సర్కార్’ తెలుగు థియేట్రికల్ హక్కులు !

భారీ ధర పలికిన ‘సర్కార్’ తెలుగు థియేట్రికల్ హక్కులు !

Published on Sep 28, 2018 5:00 PM IST

sarkar

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ‘సర్కార్’ చిత్రం యొక్క తెలుగు హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. అశోక్ వల్లభనేని ఈచిత్ర తెలుగు హక్కులను రూ.6కోట్లకు దక్కించుకున్నారు. తెలుగులో విజయ్ నటించిన సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం ఇదే మొదటి సారి. ఇక అశోక్ ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ ను తెలుగులో విడుదల చేశారు.

ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక అక్టోబర్ 2న చెన్నైలో జరుగనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా రానున్న ఈ చిత్రం భారీ ఆంచనాల మధ్య నవంబర్ 7న విడుదలకానుంది.

తాజా వార్తలు