‘పందెంకోడి 3’ కూడా ప్లాన్ చేస్తున్నాం – విశాల్ !

‘పందెంకోడి 3’ కూడా ప్లాన్ చేస్తున్నాం – విశాల్ !

Published on Oct 24, 2018 9:52 AM IST

pandemkodi3

ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో మాస్‌ హీరో విశాల్‌ నటించిన చిత్రం ‘పందెంకోడి 2’. దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదలైన ఈ చిత్రం సూపర్‌ ఓపెనింగ్స్‌తో మంచి విజయం సాధించింది. 6 కోట్లకు ఈచిత్రాన్ని కొంటె 5 రోజులకే 5 కోట్ల 63 లక్షలకు పైగా షేర్‌ను రాబట్టి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా మాస్‌ హీరో విశాల్‌ మాట్లాడుతూ ‘పందెం కోడి’ చిత్రం నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్‌ మూవీ. నేనెక్కడికి వెళ్ళినా అందరూ పందెం కోడి.. అని పిలిచేవారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ చెయ్యాలనుకున్నప్పుడు ఆ సినిమా రేంజ్‌లో చెయ్యగలమా అనే ఒక టెన్షన్‌ ఉండేది. అందువల్లే పందెంకోడి 2 చెయ్యడానికి 13 ఏళ్ళు పట్టింది. నేను, లింగుస్వామి కథను నమ్మి ఈ సినిమా చేశాం. లింగుస్వామి ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ప్రేక్షకులు ఈ సినిమాను మేం ఊహించిన దానికంటే పెద్ద హిట్‌ చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్‌ కూడా బాగా పండింది. ఈ విజయం స్ఫూర్తితో ‘పందెంకోడి 3’ని ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ‘మహానటి’ వంటి క్లాసిక్‌ మూవీ తర్వాత ఒక మంచి మాస్‌ క్యారెక్టర్‌ ఈ సినిమాలో చేశాను. ఈ క్యారెక్టర్‌ చేస్తున్నప్పుడే థ్రిల్‌ అనిపించింది. రిలీజ్‌ అయ్యాక నా పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం చాలా ఆనందం కలిగించింది. ‘పందెం కోడి 2’ అనేది నా కెరీర్‌లో ఓ స్పెషల్‌ మూవీ అయింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

లింగుస్వామి మాట్లాడుతూ ‘పందెంకోడి’ కంటే పందెంకోడి 2’కి రెస్పాన్స్‌ టెరిఫిక్‌గా ఉంది. ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌. ఈ సినిమా కంటే పెద్ద రేంజ్‌లో ‘పందెంకోడి 3’ ఉండేలా స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాం” అన్నారు.

ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ఇంతటి మంచి హిట్‌ సినిమాని మాకు అందించిన విశాల్‌కి, లింగుస్వామికి, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఈ దసరా పండగకు మా సంస్థకు మంచి విజయాన్ని అందించిన అందరికీ థాంక్స్‌ అన్నారు.

తాజా వార్తలు