బ్రెజిల్‌లో ఈగ స్పెషల్ స్క్రీనింగ్.. దుమ్ములేపనున్న ‘వారణాసి’ గ్లింప్స్

బ్రెజిల్‌లో ఈగ స్పెషల్ స్క్రీనింగ్.. దుమ్ములేపనున్న ‘వారణాసి’ గ్లింప్స్

Published on Mar 28, 2026 5:04 PM IST

varanasi 2

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ‘ఈగ’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. సౌత్ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో గల సాల్వడార్ నగరంలో ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది. మార్చి 29న ఉదయం 10 గంటల నుండి ‘XXI పనోరమా ఇంటర్నేషనల్ కోయిసా డి సినిమా’ వేడుకల్లో భాగంగా సినీ గ్లాబర్ రోచా థియేటర్‌లో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలో మరో విశేషం ఏమిటంటే, సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులకు ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ ను ప్రదర్శించనున్నారు. రాజమౌళి సినిమాలకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా, బ్రెజిల్ దేశపు సినీ ప్రియులు ఈ ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటి దక్షిణ అమెరికాలో ప్రదర్శితం కావడం విశేషం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ వైరల్ అవుతోంది. గతంలో ‘బాహుబలి’, ‘RRR’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, ఇప్పుడు తన పాత చిత్రం ‘ఈగ’తో మరోసారి విదేశీ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ స్పెషల్ షో ద్వారా ‘వారణాసి’ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు