గీతానంద్, చాందిని భగవాని హీరో హీరోయిన్లుగా చంద్ర శేఖర్ కనూరి తెరకెక్కించిన చిత్రం రథం. ఎ.వినోద్ సమర్పణలో రాజా దరపునేని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేశారు. నటి ప్రమోదిని, దేవ్ రాజ్, నివ శర్మ, నరేన్, వినోద్, మాస్టర్ ఉజ్వల్ తదితరులు పాలొగొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత రమేష్ పుప్పాల, ఎస్ గోపాల్ రెడ్డి, మధు, లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మొదట రమేష్ పుప్పాల మాట్లాడుతూ రథం చిత్ర నిర్మాత రాజా నాకు బాగా తెలుసు హీరో అవుతాడనుకున్నా ఇలా ప్రొడ్యూసర్ అయ్యారు. చాలా గొప్ప ప్రమోషన్ చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్ర శేఖర్ కష్టం అంతా ట్రైలర్ లోనే కనపడుతోంది. ప్రేక్షలులు ఈ చిత్రానికి బ్రహ్మ రథం పడతారని ఆశిస్తున్నా.
ఈ చిత్ర నిర్మాత రాజా మాట్లాడుతూ ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక సినిమా చూస్తే గూస్ బంబ్స్ వస్తాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడయ్యాయి . అక్కడే ఈ చిత్ర సక్సెస్ కనపడుతోంది. ఈ నెల 26న గ్రాండ్ రిలీజ్ అవనుంది చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా ఈ రెండు రోజులు కూడా పేటిఎం లో కూడా ప్రమోషన్ ఉంటుంది.
హీరో గీతానంద్ మాట్లాడుతూ నన్ను నమ్మి ఇంత మంచి సినిమా నాతో చేసిన టీమ్ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ చాలా సపోర్టివ్. ఏ రోజుకూడా ఎవరిపైనా కోప్పడకుండా కూల్ గా సినిమా చేసుకుంటూ వెళ్లారు అయన. ఇక దర్శకుడు సినిమాను చించేసాడు అని చెప్పాలి. తన కష్టం మొత్తం కనపడుతుంది. హీరోయిన్ చాందిని హార్ట్ అండ్ సోల్ ఈ సినిమాకు అని చెప్పాలి. రొటీన్ కథ చూస్తున్నట్టు ఉండదు ఈ రథం చిత్రం అని అన్నారు.


