బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ ?

బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ ?

Published on Mar 29, 2026 11:01 AM IST

NBK111

బాలయ్య బాబు – గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బోల్డ్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కీలక పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. మరి లక్ష్మీ రాయ్ పాత్ర ఏమిటో చూడాలి. ఆమె పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తోందని.. ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని టాక్ నడుస్తోంది. అన్నట్టు గతంలో లక్ష్మీ రాయ్ – బాలయ్య కలిసి అధినాయకుడు అనే సినిమాలో కలిసి నటించారు.

కాగా సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్‌ ఇది.

తాజా వార్తలు