ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు క్రేజీ సీక్వెల్ సినిమాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న సీక్వెల్ చిత్రాల్లో ఒకటి కల్కి 2 కూడా ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా సీక్వెల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు షూట్ లో పాల్గొన్నారు. అయితే వీరి తర్వాత ఫైనల్ గా భైరవ సెట్స్ లో ఎపుడు అడుగు పెడతాడు అనేది తెలుస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ ఏప్రిల్ 10 నుంచి డార్లింగ్ హీరో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ నుంచి ఎన్ని రోజులు ఈ షూట్ ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగాల సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కల్కి 2 ప్రభాస్ ఎప్పటికి పూర్తి చేస్తాడో చూడాలి.


