మహేష్ మల్టీఫ్లెక్స్ లో మొదటగా ప్రదర్శించనున్న చిత్రం ఏంటో తెలుసా ?

మహేష్ మల్టీఫ్లెక్స్ లో మొదటగా ప్రదర్శించనున్న చిత్రం ఏంటో తెలుసా ?

Published on Oct 28, 2018 8:30 PM IST

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్తగా మల్టీ ఫ్లెక్స్ థియేటర్ల బిజినెస్లోకి అడుగు పెట్టారు. ఏషియన్ సినిమాస్ తో కలిసి ‘ఏఎమ్ బి సినిమాస్’ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ఫ్లెక్స్ థియేటర్లను నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏరియాలో నిర్మించిన మొదటి మల్టీ ఫ్లెక్స్ నవంబర్ 8న ప్రారంభం కానుంది. మహేష్ బాబు చేతుల మీదుగా ఈ మల్టీ ఫ్లెక్స్ ప్రారంభోత్సవం జరుగనుంది. ప్రస్తుతం ఆయన ‘మహర్షి’ షూటింగ్ కోసం యూ ఎస్ లో వున్నారు.

ఇక ఈ మల్టీ ఫ్లెక్స్ లో మొదటి సినిమా ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ ప్రదర్షింపబడనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రం నవంబర్ 8నవిడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు