అఫీషియల్ : మళ్లీ వాయిదా పడ్డ ‘లెనిన్’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అఫీషియల్ : మళ్లీ వాయిదా పడ్డ ‘లెనిన్’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

Published on Mar 28, 2026 7:00 PM IST

Lenin

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ మే 1న రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా రాకపోవడంతో ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతుందనే టాక్ సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే విషయంపై మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఉన్న మంచి అనుబంధం దృష్ట్యా, ‘పెద్ది’ సినిమాకు తగినంత స్పేస్ ఇచ్చేందుకు ‘లెనిన్’ టీమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా ఇండస్ట్రీలోని హీరోల మధ్య ఉన్న పరస్పర గౌరవం మరోసారి చాటిచెప్పినట్లయింది.

ఇక ‘లెనిన్’ చిత్రాన్ని జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు