హీరో మీద కేసు పెట్టిన హీరోయిన్ !

హీరో మీద కేసు పెట్టిన హీరోయిన్ !

Published on Oct 28, 2018 9:38 PM IST

Shruti

సినీ పరిశ్రమల్లో ప్రస్తుతం సంచలనంగా మారిన ‘మీటూ’ ఉద్యమం ఇంకా రసవత్తరంగానే సాగుతుంది. ఇటీవలే హీరోయిన్ శృతి హరిహరన్, సీనియర్ హీరో అర్జున్ ‘విస్మయ’ సినిమా షూటింగ్ సమయంలో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. తన వెనుక భాగాన్ని తాకి తనను బాగా ఇబ్బంది పెట్టాడని.. తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత శృతి హరిహరన్ వ్యాఖ్యలను అర్జున్ తీవ్రంగా ఖండించారు. ఈ లోపు కన్నడ సినీ పెద్దలు అర్జున్ – శృతి మధ్య రాజీ కుదర్చడానికి ప్రయత్నం చేసినా.. అది ఎందుకో సఫలం కాలేదు. దీంతో అర్జున్ శుక్రవారం శృతి హరిహరన్ పై 5 కోట్లకు పరువు నష్టం దావా కూడ వేశారు.

అయితే శృతి కూడా అనూహ్యంగా అర్జున్ పై శనివారం పోలీసు పిర్యాధు చేసింది. అర్జున్ తనను అసభ్యంగా తాకాడని ఆ పిర్యాధు ఆమె పేర్కొంది. పోలీసులు అర్జున్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. మరి అర్జున్ -శృతి మధ్య ఈ ‘మీటూ’ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు