వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చైతూ 17 !

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చైతూ 17 !

Published on Nov 23, 2018 12:11 AM IST

Naga Chaitanya

యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్న 17వ చిత్రం ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక కేవలం 4 రోజుల విరామం అనంతరం ఈచిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ నెల 26నుండి హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకానుంది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇక వివాహం అనంతరం చైతన్య , సమంత కలిసి నటిస్తున్న ఈచిత్రం ఫై మంచి అంచనాలే వున్నాయి. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు