మెగాస్టార్ తో సినిమా అంటున్న హరీష్ శంకర్!

మెగాస్టార్ తో సినిమా అంటున్న హరీష్ శంకర్!

Published on Mar 24, 2026 11:00 PM IST

Chiru and Harish 1

రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తో పలకరించిన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికీ ఆ సినిమాని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ బిజీ సమయంలోనే తను పెడుతున్న కొన్ని ముచ్చట్లు మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఇలా లేటెస్ట్ గా తన నుంచి ఓ క్రేజీ డీటెయిల్ వచ్చింది. తను మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నట్టు తెలిపారు.

తన కోసం ఒక మంచి సబ్జెక్ట్ ని రెడి చేస్తాను అని హామీ ఇస్తున్నారు. సో అన్నీ సెట్ అయితే చిరు, హరీష్ శంకర్ కలయికలో కూడా ఓ సినిమా ఉండొచ్చు అని చెప్పాలి. మరి ఇదెప్పటికి సాధ్యం అవుతుందో వేచి చూడక తప్పదు. ఇక ప్రస్తుతం ఉస్తాద్ విషయానికి వస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమానే హరీష్ శంకర్ తన గబ్బర్ సింగ్ కంటే బెటర్ వర్క్ అని చెబుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు