మహేష్ కొత్త మల్టీప్లెక్స్ లో ‘ధురంధర్ 2’ వసూళ్ల విధ్వంసం!

మహేష్ కొత్త మల్టీప్లెక్స్ లో ‘ధురంధర్ 2’ వసూళ్ల విధ్వంసం!

Published on Mar 24, 2026 7:59 PM IST

AMB

పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ గా మారిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే ధురంధర్ 2. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా వాటిని అందుకొని రికార్డు వసూళ్లు రాబడుతుంది. అయితే ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ లు అని లేకుండా అన్ని చోట్లా దుమ్ము లేపేస్తుంది.

ఇలానే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్టాబ్లిష్ చేసిన తన ఏ ఎం బి మాల్ బెంగళూరు మల్టీప్లెక్స్ లో ఈ సినిమా రికార్డ్ వసూళ్లు కేవలం ఈ కొన్ని రోజుల్లోనే రాబట్టేసినట్టు యాజమాన్యం. ఆ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ తర్వాత వీక్ ఆక్యుపెన్సీతో కొనసాగుతుంది అని పలు కామెంట్స్ కూడా వచ్చాయి.

అలాంటిది ఆ మల్టీప్లెక్స్ లోనే ఈ సినిమా వారం తిరక్కుండానే 1 కోటి గ్రాస్ ను రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదే మూమెంటంలో ఫైనల్ గ్రాస్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు