యువ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన 5వ చిత్రం ‘కవచం’ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈచిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. దాంట్లో భాగంగా ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక డిసెంబర్ 2న భీమవరంలోని చిన్నమిరం సాగి రామకృష్ణం రాజు ఇంజనీరింగ్ కళాశాలలో సాయంత్రం 6గంటలకు జరుగనుంది.
నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కాజల్ , మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ నిర్మించింది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది.


