‘కృష్ణార్జున యుద్ధం’ డైరక్టర్ తో నాగ చైతన్య ?

‘కృష్ణార్జున యుద్ధం’ డైరక్టర్ తో నాగ చైతన్య ?

Published on Dec 6, 2018 12:07 AM IST

Naga Chaitanya

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన 17వ చిత్రంలో నటిస్తున్నాడు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చైతూ కి జోడిగా సమంత నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం తో పాటు చైతు అగ్ర హీరో వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’ లో నటించనున్నాడు. త్వరలోనే ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా చైతన్య మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. యూవీ క్రీయేషన్స్ బ్యానర్ లో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఫేమ్ మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్నీ తెరకెక్కించనున్నాడట. అయితే ఈ వార్తల ఫై అధికారిక సమాచారం వెలుబడాల్సి వుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు