
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ ప్రమోషన్స్ లో జోరు పెంచేందుకు రెడీ అవుతుంది. అందులో భాగంగా ఈ చిత్రంలోని రెండవ పాటను డిసెంబర్ 15న విడుదల చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 24న జరుపడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
అయితే వీటిపై అధికారిక సమాచారం లేనందున ఈ తేదీల్లో స్వల్ప మార్పు కూడా వుండే అవకాశాలు వున్నాయి. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనెర్ లో కియారా అద్వానీ కథానాయిక కాగా వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డివివి నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

