యశ్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్‌ను అందుకున్నా.. ఆశించిన స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. ఈ సినిమా కంటెంట్ అంచనాలను అందుకోకపోవడంతో.. రెండవ రోజు నుంచే వసూళ్లు బాగా పడిపోయాయి. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఐతే, లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఐదు రోజులకు గానూ సుమారు రూ. 275 కోట్ల నుంచి రూ. 280 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది.
కాగా సినిమాకి పెట్టిన బడ్జెట్ భారీగా పెట్టడం, మరోవైపు ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ కు ఏమాత్రం పోలిక లేదు. అటు టాక్సిక్ హిందీ వెర్షన్ అద్భుతంగా ప్రారంభమైంది, కానీ అక్కడ కూడా ప్రతికూల సమీక్షలు, బ్యాడ్ ప్రచారం కారణంగా హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకూ గణనీయంగా పడిపోయాయి. ఇక ఇతర డబ్బింగ్ వెర్షన్లు కూడా ఆకట్టుకోలేకపోయాయి. మొత్తానికి టాక్సిక్ భారీ ప్లాప్ గా నిలిచింది.


