ట్రైలర్ టాక్ : యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా వస్తున్న కార్తీ ‘సర్దార్ 2’

ట్రైలర్ టాక్ : యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా వస్తున్న కార్తీ ‘సర్దార్ 2’

Published on Aug 31, 2026 8:37 PM IST

తమిళ హీరో కార్తీ, దర్శకుడు పి.ఎస్. మిత్రన్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘సర్దార్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకునేలా కట్ చేశారు.

కార్తీ వైవిధ్యమైన లుక్స్, పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ డైలాగ్ డెలివరీ హైలైట్‌గా నిలిచాయి. పి.ఎస్. మిత్రన్ తన మేకింగ్ స్టైల్‌తో ఈసారి మరింత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్పెక్ట్రమ్‌లో కథను ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌లో వచ్చే విజువల్స్, ఉత్కంఠ రేకెత్తించే బీజీఎం మరియు హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తున్నాయి.

ఇక విలన్‌గా ఎస్‌.జె. సూర్య ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. కార్తీ, ఎస్‌.జె. సూర్యల మధ్య మైండ్ గేమ్‌లు సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. ఓవరాల్‌గా ‘సర్దార్ 2’ ట్రైలర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ మాస్, యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్‌తో థియేటర్లలో సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోందని స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించగా సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు