ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మొదటివరుసలో ఉంటుంది. అందుకే ఆయన ఏమి చేసినా అది సెన్సేషనే అవుతుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రజినీకాంత్ ఉన్నట్టు ఉండి అమెరికాకు పయనం అయ్యారు. రజిని తన హెల్త్ కు సంబంధించిన చెకప్ ల కోసం అమెరికాకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ ఏమైందో అని ఆయన అభిమానులు ఖంగారు పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం రజిని రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగంగానే అమెరికా పయనం అయ్యారట. మళ్లీ జనవరి మొదటి వారంలో సూపర్ స్టార్ ఇండియాకి తిరిగి రానున్నారు.


