‘ఇరుముడి’ విజయ పరంపర.. ఏకంగా 7 మిలియన్లకు పైగా టిక్కెట్లు !

‘ఇరుముడి’ విజయ పరంపర.. ఏకంగా 7 మిలియన్లకు పైగా టిక్కెట్లు !

Published on Aug 31, 2026 12:00 PM IST

irumudi

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన బ్లాక్‌ బస్టర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద తన విజయ పరంపరను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్కును దాటింది. మరో కీలక మైలురాయి దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. బుక్‌ మైషో మరియు డిస్ట్రిక్ట్ ప్లాట్‌ ఫామ్స్‌ లో కలిపి ఈ చిత్రం 7 మిలియన్లకు పైగా టిక్కెట్లను అమ్ముకుంది. ఒక ప్రాంతీయ చిత్రానికి ఇది చాలా అరుదైన ఘనత.

ప్రేక్షకుల నుంచి డిమాండ్ బలంగా ఉండటంతో, ‘ఇరుముడి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో బేబీ నక్షత్ర, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది.

తాజా వార్తలు