ఇంటర్వ్యూ : హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ – ‘రోమాంచకం’ యూత్‌కు బాగా రిలేట్ అవుతుంది..!

ఇంటర్వ్యూ : హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ – ‘రోమాంచకం’ యూత్‌కు బాగా రిలేట్ అవుతుంది..!

Published on Aug 31, 2026 5:49 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రోమాంచకం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వేణుగోపాల్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరోరయిన్ అనంతిక సనిల్ కుమార్ మీడియాతో ముచ్చటించారు.

-‘8 వసంతాలు’ తర్వాత చాలా కథలు విన్నా ఏవీ నన్ను అంతగా మెప్పించలేదు. కానీ ‘రోమాంచకం’ స్క్రిప్ట్ వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో నేను అనుకున్నట్టే ఒక బబ్లీ, సరదా అమ్మాయి పాత్రలో నటించాను. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే ఈ చిత్రంలో ప్రేమతో పాటు మంచి హాస్యం, ఉత్కంఠ కూడా ఉంటాయి.

– ఈ సినిమాలో నేను తమిళ అమ్మాయిగా కనిపిస్తాను. నేటి తరం యువత జీవితాలకు అద్దంపట్టే కాంటెంపరరీ లవ్ స్టోరీ ఇది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఇది మెప్పిస్తుంది. సుమంత్ ప్రభాస్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ చూస్తే, నా పాత్ర కూడా దానికి పోటీగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య డైలాగ్స్ చాలా న్యాచురల్‌గా, ఎక్కడా ల్యాగ్ లేకుండా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతాయి.

– ‘8 వసంతాలు’ లాంటి ఇంటెన్స్ డ్రామా తర్వాత నేను కోరుకున్న సరదా లవ్ స్టోరీ ‘రోమాంచకం’. షూటింగ్ కూడా అంతే ఫన్‌గా సాగింది. దర్శకుడి క్లారిటీ, నా పాత్ర డిజైన్, మ్యూజికల్ డ్రామాగా ఈ కథకున్న స్కోప్ నచ్చి ఈ సినిమా చేశాను.

– ఈ సినిమాలో నటించేటప్పుడు నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్స్ చాలా ఉన్నాయి. నా పర్‌ఫార్మెన్స్‌కు సందీప్ గారి నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. హీరో సుమంత్ ప్రభాస్‌ను మొదటిసారి కలిసినప్పుడే మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. రిహార్సల్స్ వల్ల మా మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి గారు మొదట్లో కోపధారిగా అనిపించినా, ఆయన చాలా సరదా మనిషని తర్వాత అర్థమైంది.

– ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో వచ్చే అవకాశాలను బట్టి సినిమాలు చేస్తున్నాను. ఎల్‌కేజీ నుంచే డాన్స్, ఫైట్స్ వంటి రకరకాల కళలు నేర్చుకోవడం వల్ల నటిగా నా ప్రతిభ మరింత మెరుగైంది. ఊరికే ఉండటం నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్న కళలే ఈ రోజు నటిగా నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

– 8 వసంతాలు సినిమాలో నాకు మంచి పేరొచ్చింది. ఈ చిత్రంలో నాతో పాటు హీరోకు కూడా మంచి పేరు వస్తుంది. అయితే ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలని ఉంది. నటిగా కొత్త తరహా పాత్రలు, సినిమాలు, జానర్ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో నటిస్తున్నప్పుడు నేను సంతృప్తిగా ఫీలవ్వాలి, ఆ క్యారెక్టర్ నాకు సంతోషాన్నివ్వాలి.

– ఈ చిత్రంలో లవ్, కామెడీ, థ్రిల్స్ బలంగా ఉంటాయి. అందులో ప్రేమ వల్ల వచ్చే ఉత్కంఠే నాకు బాగా నచ్చింది. నేను గతంలో చేసిన పాత్రల కంటే ఇది చాలా డిఫరెంట్. మేము షూటింగ్ లో ఎంత సరదాగా ఎంజాయ్ చేశామో, థియేటర్లలో ఆడియెన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు