‘ధైర్యంగా నీ కలలను నిజం చేసుకో’: గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు వేళ మహేష్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్

‘ధైర్యంగా నీ కలలను నిజం చేసుకో’: గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు వేళ మహేష్ బాబు ఎమోషనల్ బర్త్‌డే విషెస్

Published on Aug 31, 2026 5:59 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తనయుడు గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కొడుకుతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు.

‘ధైర్యంగా కలలను సాకారం చేసుకో’

గౌతమ్‌తో కలిసి నడుస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మహేష్ బాబు.. “హ్యాపీ 20 జీజీ (GG). జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నిజం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ రోజే కాదు, ప్రతి రోజూ నీ గురించి ఎంతో గర్వపడుతుంటాను” అని పేర్కొన్నారు.

పచ్చని ప్రకృతి నడుమ తండ్రీకొడుకులు సరదాగా నడుస్తున్న ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. గౌతమ్ 20వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఘట్టమనేని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు