ధనుష్ కొత్తసినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

ధనుష్ కొత్తసినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్ !

Published on Dec 23, 2018 10:05 PM IST

dhanush

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి 2’ ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది . ఇక ఈచిత్రం తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ తన కొత్త చిత్రంలో నటించనున్నాడు. ఈచిత్రానికి ‘అసురన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు .

పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు. తర్వలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం కోసం ధనుష్ తన దర్శకత్వం వహిస్తున్నమల్టీ స్టారర్ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాడు. ఇటీవలే ఒక షెడ్యూల్ పూర్తి చేసిన ఈ చిత్రాన్ని అసురన్ పూర్తి చేసిన తరువాత మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈచిత్రంలో కింగ్ నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు