
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ ఇటీవలే ఆడియో & ట్రైలర్ లాంచ్ ను గ్రాండ్ గా జరుపుకున్న విషయం తెలిసిందే.
కాగా ఈ ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ లో మోహన్‌బాబు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇప్పుడు మళ్లీ ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కి తనకి మధ్య ఉన్న చనువును అభిమానులకు తెలియజేస్తూ.. ఈ ట్వీట్ చేశారు. ‘మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలోని పుణ్యభూమి నాదేశం అనే పాట కోసం అన్నగారు చాలా గెటప్పులలో కనిపిస్తారు.. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు.’ అని పోస్ట్ చేశారు.
ఇక హిందీ, కన్నడ, తమిళ్ మరియు ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ ఎన్టీఆర్ బయోపిక్ డబ్బింగ్ కాబోతుందని బాలయ్య ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ లో వెల్లడించారు. మొత్తానికి ఎన్టీఆర్ బయోపిక్ ను ఇతర భాషల్లో కూడా విడుదల చెయ్యడం నందమూరి అభిమానులకు మంచి జోష్ ఇచ్చే అంశమే.

