పవన్ కళ్యాణ్ విషయంలో చాలా గర్వంగా ఉంది !

పవన్ కళ్యాణ్ విషయంలో చాలా గర్వంగా ఉంది !

Published on Dec 25, 2018 11:12 PM IST

Naga Babu1

పవన్ కళ్యాణ్ జనసేనకు మెగా హీరోలు మద్దతు సంపూర్ణంగా లభిస్తోంది. ఇప్పటికే పవన్ పై అభిమానంతో జనసేన పార్టీకి వరుణ్ తేజ్ కోటి రూపాయలు విరాళం ఇవ్వగా… నాగబాబు 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ విషయం పై స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ సహాయం తనకు ఒక క్రిస్టమస్ గిఫ్ట్ లాంటిదని ఇద్దరికి కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తెలిపిన విషయం తెలిసిందే.

కాగా తాజాగా నాగబాబు ఓ వీడియోలో ఈ విషయం పై స్పందిస్తూ.. పవన్ కోట్ల రూపాయిలు వదులుకొని ప్రజాసేవ కోసం జనంలోకి వెళ్లాడని, పవన్ విషయంలో తనకు చాల గర్వంగా ఉందని నాగబాబు తెలిపారు. అలాగే వరుణ్ తేజ్ కూడ బాబాయ్ కష్టపడుతున్నాడని.. ఆయన కోసం ఏదో ఒకటి చేయాలి నాన్న అని తనతో మాట్లాడుతుంటాడని.. అందుకే మా వంతుగా విరాళాలు ప్రకటించామని నాగబాబు చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు