అల్లు శిరీష్ కూడా స్టార్ట్ చేశాడు !

అల్లు శిరీష్ కూడా స్టార్ట్ చేశాడు !

Published on Dec 27, 2018 3:00 PM IST

ABCD1
యువ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ ఏబిసిడి (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి ) తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదలకానుంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఇక రేపు ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ మధ్యాహ్నం 12:30 గంటలకు రివీల్ కానుంది.

నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బెన్ సినిమాస్ అధినేత యష్ రంగినేని మరియు మధుర శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తుదిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి జుదా శాండీ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు